ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల

  • ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
  • 23,996 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 19,197 మంది ఉత్తీర్ణత
  • ఉత్తీర్ణత 80 శాతంగా నమోదైనట్లు వెల్లడి
ఏపీ లాసెట్ / ఏపీ పీజీ ఎల్ సెట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మొత్తం 23,996 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 19,197 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్లు వెల్లడించారు. ఉత్తీర్ణత 80 శాతంగా ఉందని తెలిపారు.

ర్యాంకు కార్డులు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టిక్కెట్ నెంబర్‌ను నమోదు చేసి స్కోర్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా పలితాలు తెలుసుకోవచ్చు. ఏపీ లాసెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలియజేశారు.

Nara Lokesh
AP LAWCET Results
AP LAWCET 2024
Andhra Pradesh Law Common Entrance Test
LAWCET Results

More Telugu News